Advertisementt

రజినీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు

Sat 01st May 2021 08:49 PM
rajinikanth,director shiva,annaatthe shooting,special care,covid 19,nayanthara  రజినీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు
Annaatthe shooting spot like a super speciality hospital రజినీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు
Advertisement
Ads by CJ

తెలంగాణ లో లాక్ డౌన్ లేకపోయినా.. కొన్ని సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడిపోయాయి. సోను సూద్ వలన ఆచార్య, నిరాటంకంగా షూటింగ్ చేస్తున్న పుష్ప కూడా ఎట్టకేలకి షూటింగ్ కి బ్రేకులు వేసింది. కానీ బాలయ్య అఖండ, రజినీకాంత్ అన్నాత్తై షూటింగ్స్ మాత్రం ఆగలేదు. రజినీకాంత్ ఒకసారి సిక్ అవడంతో షూటింగ్ కి లాంగ్ గ్యాప్ ఇచ్చిన దర్శకుడు శివ ఈసారి షూటింగ్ ఎట్టిపరిస్థితుల్లో వాయిదా పడకుండా ప్లాన్ చేసుకోవడమే కాదు.. అన్నాత్తై షూటింగ్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. అందుకే షూటింగ్ స్పాట్ లో డాక్టర్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు.

కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు.. అక్కడ షూటింగ్ లో ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్స్ తో దర్శనమిస్తున్నారు. షూటింగ్ కోసం అక్కడ పనిచేసేవారు, షూటింగ్ లో పాల్గొనేవారు పూర్తి శానిటైజేషన్ అలాగే పీపీఈ కిట్స్ తో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా అన్నాత్తై షూటింగ్ లోకి ఎంటర్ అవ్వాల్సిందేనట. ఇక రజినీకాంత్ ని అయితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నట్లే ఉంది అక్కడ వాతావరణం. రజినీకాంత్ కి దర్శకుడు శివ దగ్గరకి రాకుండా భౌతిక దూరం పాటిస్తూ సీన్ వివరిస్తున్నాడు అంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందొ ఈపాటికే అర్ధమవుతుంది. ఆయన మేకప్ మ్యాన్, అసిస్టెంట్ కూడా పీపీఈ కిట్స్ వేసుకునే రజినీకి తోడుగా ఉంటున్నారట. చాలా సేఫ్ గా, బయటి వ్యక్తులు షూటింగ్ సెట్స్ కి రానివ్వకుండా రామోజీ ఫిలిం సిటీలోనే సెల్ఫ్ ఐసోలేషన్ మాదిరి యూనిట్ మెంబెర్స్ మొత్తం అక్కడే స్టే చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా నయన్ క్లూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి అన్నాత్తై షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఇలా ఎవరికీ వారే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ ని అన్నాత్తై సెట్స్ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తపడుతున్నారట.

Annaatthe shooting spot like a super speciality hospital:

Rajinikanth Annaatthe shooting spot taking special care due to Covid

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ