బుల్లితెర మీద ఢీ డాన్స్ షో, డ్రామా జూనియర్స్ ఇంకా చాలా షోస్ తో సందడి చేసే యాంకర్ ప్రదీప్.. కొత్తగా హీరో అవతారమెత్తాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రదీప్ బయటికి రావడం లేదు. కారణం ప్రదీప్ కి కరోనా పాజిటివ్ రావడంతో అతను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్రదీప్ మాత్రం తనకి కరోనా సోకినట్లుగా.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రదీప్ రీసెంట్ టివి షో అయిన డ్రామా జూనియర్స్ కి ప్రదీప్ యాంకర్ గా కాకుండా రవి యాంకర్ గా వస్తున్నాడు.
అయితే తాజాగా ప్రదీప్ ఇంట్లో తీవ్ర విషాదం లనెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ తండ్రి పాండు రంగ రావు కన్నుమూశారు. ప్రదీప్ కి కరోనా రావడం, ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కరోనా తో సిక్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ప్రదీప్ తండ్రి కోవిడ్ కారణంగా చనిపోయారా? లేదంటే ఇతర అనారోగ్య కారణాల వలన అయన కన్నుమూశారా అనేది తెలియాల్సి ఉంది.