ఈటెల రాజేంద్ర పై వస్తున్న అస్సైన్డ్ భూములు ఆక్రమణ కొనుగోలు వ్యవహారం నిజమవడంతో ఈటెల రాజేంద్రని సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసారు. ఈటెల రాజేంద్ర నుండి వైద్య ఆరోగ్య శాఖని కేసీఆర్ బదిలీ చేసుకున్నారు. ఈమేరకు గవర్నర్ ఈ శాఖ బదిలీ ఫైల్స్ పై సంతకాలు చేసారు. ఈటెల రాజేంద్ర అడిసైన్డ్ భూములను కబ్జాకి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడం, కేసీఆర్ వెంటనే విచారణకుగా ఆదేశించడంతో.. ఈరోజు ఉదయమే ఈటెల భూములపై డిజిటల్ సర్వ్ నిర్వహించడంతో పాటు.. అక్కడ అచ్చంపేటలో పెద్ద ఎత్తుల పోలీస్ లి మోహరించడం.. ఆ విచారణ కొనసాగుతుండగానే కేసీఆర్ ఈటెల రాజేంద్ర నుండి వైద్య ఆరోగ్య శాఖని లాగేసుకున్నారు.
ఏ శాఖ నైనా కేసీఆర్ తీసుకునే హక్కు సీఎంగా ఆయనకు ఉంది. అయితే నాతొ సీఎం కేసీఆర్ మాట్లాడాల్సింది. నేను కేసీఆర్ ని వెళ్లి కలవను, ఆయన కాళ్ళ మీద పడను. అనుకున్నదే అయ్యింది. నాకు మంత్రి పదవి లేకపోయినా.. ప్రజలకి సేవ చెయ్యగలను. ఓ ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతుంది అని తన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈటెల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హేయమైన చర్యలను ప్రజలే అస్సహించుకుంటారని, రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారంటూ ఈటెల హెచ్చరిస్తున్నారు.