కరోనా సెకండ్ వేవ్ తో ఏ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ మాత్రం ఆగలేదు. ఆఖరికి అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ వచ్చినా సుకుమార్ మాత్రం పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇవ్వలేదు. అయితే తాజాగా పుష్ప షూటింగ్ ఎట్టకేలకి బ్రేకులు పడినట్లుగా తెలుస్తుంది. రష్మిక, అనసూయ, ఇంకా సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న వారంతా సుకుమార్ కి అందుబాటులోనే ఉన్నారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప. అందుకే సుకుమార్ మిగతా నటులతో పెట్టి కీలక సన్నివేశాలు, అలాగే విలన్ ఫహద్ ఫాజిల్ పై సన్నివేసాలు పూర్తి చేసేద్దామనుకున్నారట.
అల్లు అర్జు తో ఫైట్ చేస్తున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. అల్లు అర్జున్ కి కరోనా రావడంతో అల్లు అర్జున్ - ఫహద్ కాంబో సీన్స్ వాయిదా పడినా.. మిగతా ఫహద్ సీన్స్ ని సుకుమార్ తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. కానీ ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు పుష్ప షూటింగ్ నుండి జంప్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ చేయలేనని, పరిస్థితులు అనుకూలించాకే షూటింగ్ చేద్దామని సుకుమార్ కి చెప్పి ఫహద్ ఫ్లైట్ ఎక్కేసినట్లుగా తెలుస్తుంది. దానితో ఎంతమంది అందుబాటులో ఉన్నా పుష్ప హీరో - విలన్ లు అందుబాటులో లేకపోవడంతో సుకుమార్ చివరికి పుష్ప షూటింగ్ కి ప్యాకప్ చెప్పెయ్యాల్సి వచ్చిందట.