తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్రని అస్సైన్డ్ భూ కుంభ కోణంలో కొన్ని న్యూస్ ఛానల్స్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ప్రభుత్వం దగ్గర అడ్డంగా ఇరికించిన విషయం తెలిసిందే. నిన్న శుక్రవారం సాయంత్రం నుండి పలు న్యూస్ ఛానల్స్ లో ఈటెల అస్సైన్డ్ భూముల కుంభ కోణం అనే వార్తలతో, పేద రైతుల భూములని కబ్జా చేసారని రైతులు సీఎం కేసీఆర్ కి ఇచ్చిన కంప్లైంట్ తో అలెర్ట్ అయిన సీఎం కేసీఆర్ కనీసం ఈటెల రాజేంద్రని ప్రశ్నించకుండా.. ఈటెల మీద అభియోగంపై విచారణ జరపాల్సింది గా సీఎం సోమేశ్ కుమార్ ని ఆదేశించారు. అలాగే మెదక్ జిల్లా కలెక్టర్ ని ఈ విచారణ చెప్పాల్సిందిగా ఆజ్ఞలు జారీ చేసారు. దానితో ఈటెల రాజేంద్ర భార్య జమున తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు.. నాది తప్పు అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను. కొన్ని న్యూస్ ఛానల్స్ నా మీది విషపూరితమైన అభియోగాలని నెడుతున్నాయి. సీఎం కేసీఆర్ నాతో మాట్లాడిన తర్వాత విచారణకి అనుమతి ఇస్తే బావుండేది.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్దమే అని ప్రకటించారు.
ఇక ఈటెల అన్నారని కాదు కానీ.. న్యూస్ ఛానల్స్ లో వచ్చిన విషయంపై సీఎం కేసీఆర్ అంతగా రియాక్ట్ కావడం ఎవరికి అర్ధం కావడం లేదు. సరే ఓ మంత్రి భూ కుంభకోణం లో ఉన్నారంటే ఆ మంత్రిని పిలిచి ఆయన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఆయనపై విచారణకు ఆదేశిస్తే బావుండేది. కానీ ఈ రోజు ఉదయమే ఆ జిల్లా కలేక్టర్, తాసిల్దారు అందరూ జమున హ్యాచరీస్ దగ్గరకు వెళ్లి అస్సైన్డ్ భూములని సర్వే చేపట్టడం, తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ లు మోహరించడం, అన్నీ చూస్తుంటే ఈటెలకు వ్యతిరేఖంగా జరుగుతున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. పేద రైతుల కంప్లైంట్ మేరకే ఈటెలపై ఇలాంటి చర్యలని ప్రభుత్వం చెబుతున్నా.. ఈటెలకు కేసీఆర్ స్పాట్ పెట్టారనేది క్లారిటీగా కనిపిస్తుంది. గతంలో పార్టీ కి ఓనర్లం, జండా మాది అంటూ టీఆరెస్ ప్రభుత్వం, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే, ఆలా మాట్లాడిన ఈటెలని ఇరికించే ప్రయత్నాలేమో అనే అనుమానాలు ఇప్పుడు ఈటెల అభిమానులు, అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.