మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ఆగింది అని కానీ, జరుగుతుంది అనేది కానీ ఎవరికీ స్పష్టత లేదు. మొన్నామధ్యన సర్కారు వారి పాట యూనిట్ లో నలుగురికి కరోనా సోకడం వలన షూటింగ్ ఆగింది అన్నా.. ఎలాంటి అప్ డేట్ లేదు. 2022 సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఓ నెల షూటింగ్ వాయిదా పడినా పెద్దగా టెంక్షన్ పడడం లేదు టీం. మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ ఎప్పుడు ఇస్తారో అని మహేష్ అభిమానులు చూస్తున్నారు. అయితే మే 31 న కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ లుక్ రాబోతుంది అని తెలుస్తుంది.
అంతేకాదు.. అదే రోజున మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబో మూవీ అనౌన్సమెంట్ వస్తుంది అని.. మహేష్ పుట్టిన రోజు ఆగష్టు 9 న సర్కారు వారి పాటు టీజర్ తో పాటుగా త్రివిక్రమ్ మూవీ పూజా కార్యక్రమాలు ఉంటాయని టాక్ అయితే ఉంది. మరి మరో నెలలో అంటే మే 31 న మహేష్ అభిమానులకి అటు పరుశురాం సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ సర్ప్రైజ్ ఇస్తుంటే.. ఇటు త్రివిక్రమ్ తో మూవీ ఎనౌన్స్ చేసి మహేష్ అభిమానులకి మరో సర్ప్రైజ్ చెయ్యబోతున్నారు. మరి మహేష్ ఫాన్స్ మే 31 సెలెబ్రేషన్స్ కి ఇప్పటినుండే రెడీ అవుతున్నారట.