కరోనా మహమ్మారి దేశాన్ని కబళించి వేస్తుంది. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దేశం మొత్తం కరోనా రోగుల ఆహాకారాలతో అల్లకల్లోలంగా ఉంది. చాలా రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యడం, రద్దు చెయ్యడం జరిగింది. సిబిఎసి 10th ఎగ్జామ్స్ రద్దు చేసి 12th క్లాస్ పరీక్షలను పోస్ట్ పోన్ చేసింది. ఇక తెలంగాణాలో పది పరీక్షలని రద్దు చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసారు. కాని ఆంధ్రాలో మాత్రం 10, ఇంటర్ ఎగ్జామ్స్ యధాతధంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించే మొండి పట్టుదలతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పది, ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్బహించి తీరతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. కానీ ప్రతి పక్షాలు విద్యార్థులకి చదువు కన్నా ప్రాణాలు ముఖ్యమని, కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న వేళ పరీక్షలు నిర్వహించడం, మంచిది కాదంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నా.. ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో చేస్తున్న హడావుడితో విద్యార్థులు ప్రాణాల మీదకి వస్తుంది అంటూ ప్రతి పక్షాలు కోర్టుకెళ్లాయి. అయినా జగన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు పరీక్షలపై తగ్గేదే లే అంటూ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు.
హై కోర్టు కూడా మే 3 లోపు పరీక్షల నిర్వహణపై పునరాలోచించుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థుల మేలు కోరి పరీక్షల నిర్వహణ చేపట్టాలా? లేదా? అనేది మే 3 లోపు చెప్పాలని కోర్టు ఆదేశించింది. కానీ హై కోర్టు చెప్పిన కాసేపటికే.. మే 7 నుండి ఇంటర్ పరీక్షలు యధాతధంగా జరుగుతాయని, పరిక్షా కేంద్రాల వద్ద కోవిడ్ కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వ్బహిస్తామని, కేంద్రం పరీక్షల నిర్బహణపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదని, కేవలం రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది అని, పిలల్లు పరీక్షలు రాస్తేనే.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని, పరీక్షలు నిర్వహించడానికి రెడీ అవుతున్నామని చెప్పడం చూస్తే జగన్ ఎప్పటిలాగే కోర్టు నిర్ణయాన్ని పట్టించుకునేలా కనిపించడంలేదనిపిస్తుంది.