లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మొదలైన ఇండియన్ 2 మూవీ క్రేన్ యాక్సిడెంట్ తో ఆగిపోయిన విషయం తెల్సిందే. అయితే ఇండియన్ 2 సినిమా మొదలెట్టినప్పటినుండి దర్శకుడు శంకర్ కి లైకా ప్రొడక్షన్ కి పొసగడం లేదు.. మితిమీరిన బడ్జెట్ శంకర్ పెట్టిస్తూన్నారనే అసంతృప్తి తో లైకా ప్రొడక్షన్ ఉంది. క్రేన్ యాక్సిడెంట్ లో శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడంతో వాళ్ళకి పరిహారం ఇప్పించడంతో లైకా వారు శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అందుకే సినిమా ఆగిపోయినా.. లైకా ప్రొడెక్షన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక శంకర్ మెల్లిగా సైడ్ తీసుకుని రామ్ చరణ్, రన్వీర్ లతో సినిమాలు అనౌన్స్ చేసేసారు.
దానితో శంకర్ ని ఇరకాటంలో పెట్టేందుకు లైకా ప్రొడక్షన్ వారు కోర్టుకెళ్లి ఇండియన్ 2 పూర్తి చేసి వేరే ప్రాజెక్ట్స్ చేసుకోమని శంకర్ కి చెప్పాలంటూ పట్టుబట్టింది. శంకర్ నాదేం లేదు విదేశీ నిపుణులు వస్తే ఇండియన్ 2 షూటింగ్ ఫినిష్ చేస్తా అని చెప్పాడు. కోర్టులో ఎందుకు ఇద్దరూ సామరస్యంగా కూర్చుని విషయం తేల్చుకోమని కోర్టు చెప్పింది. అయితే తాజాగా శంకర్ న్యాయవాది లైక్ ప్రొడక్షన్ కి సాగిన చర్చల్లో ఇండియన్ 2 జూన్ లో మొదలు పెట్టి అక్టోబర్ కల్లా ఫినిష్ చేస్తామని చెప్పగా.. కాదు కూడదు జూన్ లోనే ఇండియన్ 2 ని ఫినిష్ చేసి ఇవ్వాలని లైకా ప్రొడక్షన్ పట్టుబట్టడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. అసలు లైకా ప్రొడక్షన్స్ వారికి శంకర్ తో ముందుకెళ్లడం ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే కోర్టుకి వెళ్లైనట్టు స్పష్టమవుతుంది. లేదంటే కోర్టు చెప్పినట్టు సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని ముందడుగు వెయ్యాలి కానీ.. ఇలా చేస్తే ఎలా అంటున్నారు.