కోలీవుడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈ రోజు తెల్లవారిఝామున హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారనే వార్త తమిళ ఇండస్ట్రీనే కాదు, సినిమా ప్రియులందరిని విషాదంలో ముంచేసింది. 54 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో ఆయన కన్నుముయ్యడం సినీప్రముఖులని కలిచివేసింది. అయితే కెవి ఆనంద్ హార్ట్ ఎటాక్ తో కనుముయ్యలేదని.. కరోనా మహమ్మారి ఆయన్ని మింగేసినట్లుగా ఆయనని అడ్మిట్ చేసిన చెన్నై ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాజుల క్రితం కెవి ఆనంద్ రిలేటివ్స్ కి కరోనా సోకగా.. ఆయన వాళ్లతో ఉండడంతో.. ఆనంద్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు.
ఆయనకి కరోనా పాజిటివ్ గా తేలాక.. శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో.. ఆనంద్ హాస్పిటల్ లో చేరినట్లుగా చెబుతున్నారు. కానీ కరోనా తో పోరాడలేక ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారని తెలుస్తుంది. ఆయన మరణానంతరం ఆ హస్పిటల్ వర్గాలు ఆనంద్ మృత దేహాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆనంద్ తో ఎంతో అనుబంధం ఉన్న హీరో సూర్య ఆసుపత్రి వర్గాలతో మాట్లడినా ఆనంద్ మృత దేహాన్ని ఇవ్వడం కుదరదని, కోవిడ్ నిబంధనల దృష్యా ఆయన మృత దేహాన్ని ఇవ్వమని.. ఆయనకి కరోనా సోకినట్లుగా హాస్పిటల్ వర్గాలు తేల్చేశాయట. హార్ట్ ఎటాక్ తో చనిపోయారన్న ఆనంద్ ఇలా కరొనతో మరణించడం మరింత కలవరానికి గురిచేస్తుంది.