Advertisementt

ఆర్.ఆర్.ఆర్ లో హైలెట్ సీన్ అదే

Thu 29th Apr 2021 10:47 PM
ntr,ram charan,rrr movie,rajamouli,rrr highlight scene  ఆర్.ఆర్.ఆర్ లో హైలెట్ సీన్ అదే
This is the highlight scene in R.R.R ఆర్.ఆర్.ఆర్ లో హైలెట్ సీన్ అదే
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ విడుదల చేస్తున్నామని రిలీజ్ డేట్ ప్రకటించినా.. ప్రస్తుతం కరోనా సంక్షోభం ముందు అనుకున్న డేట్ కి ఆర్.ఆర్.ఆర్ వస్తుందా? అనే నిరాశలో ఫాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ని స్రీన్ మీద చూసి అప్పుడే రెండేళ్లు అవుతుంది. అందులోనూ భారీ అంచనాలున్న ఆర్.ఆర్.ఆర్ కోసం ఫాన్స్ వెయిట్ చేసే కొద్దీ ఆ సినిమా వెనక్కి పోతూనే ఉంది. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదరగొట్టేసే మెకోవేర్స్ లో అదిరిపోతున్నారు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ హైలెట్ అవుతాయని, రామ్ చరణ్ యాక్షన్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది అంటూ ఏవేవో కథనాలు వినిపించినా.. ఇప్పుడు మరొక న్యూస్ బయటికి వచ్చింది. అది సీతారామరాజు - కొమరం భీం లు మధ్యన కారాగారంలో ఓ అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశం ఉంటుందట. ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని, ఈ ఎమోషనల్ సన్నివేశం మరింత హైలెట్ అవుతుంది అని టాక్. ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్ మధ్యన వచ్చే ప్రతి సీన్ ఫాన్స్ కే కాదు.. ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. మరి ఇలాంటివి అన్నీ వింటుంటే ఆర్.ఆర్.ఆర్ ని ఎప్పుడు చూసేద్దామా అనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది.

This is the highlight scene in R.R.R:

RRR Movie Highlight Scene Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ