అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాని అనుకోకుండా అష్టాచెమ్మతో హీరో అయిపోయాడు. అప్పటినుండి ఇప్పటివరకు నాని తన పని ఏదో తాను చేసుకుపోతూ.. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడొక నిర్మాత మాత్రం నాని ఫై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. నాని - అశోక్ కాంబోలో తెరకెక్కిన పిల్ల జమిందార్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాని నిర్మించిన డీఎస్ రావు ఇప్పుడు నాని మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. పిల్ల జమిందార్ సినిమా డీఎస్ రావు కి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా నాని కి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే ఈమధ్యన పిల్ల జమిందార్ నిర్మాత డీఎస్ రావు ఓ ఇంటర్వ్యూ లో.. యాంకర్ ఓప్రశ్న వేసాడు. మీరు హీరో - హీరోయిన్స్ కి గిఫ్ట్స్ ఇచ్చేవారట కదా.. అని అడగగా.. గిఫ్ట్ మాత్రమే కాదు.. డబ్బులు కూడా ఇచ్చాను. కానీ ఏం ఇచ్చిన వేస్ట్.. అంటూ మాట్లాడారు. అయితే ఆయన పిల్ల జమిందార్ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని నాని కి గిఫ్ట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పిల్ల జమిందార్ సినిమా పూర్తయ్యాక నాని కి ఇవ్వాల్సిన పారితోషకం మొత్తం ఇచ్చేసాక, వాళ్ళ బావ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడని అడిగితే అతనికి ఓవర్సీస్ రైట్స్ గిఫ్ట్ గా ఇచ్చాను. నేను రూపాయి కూడా తీసుకోలేదు. సినిమా హిట్ అయ్యాక మేనేజర్ వచ్చి ఎంతివ్వమంటారు అడిగితె.. నేను ఈ సినిమా హిట్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నాను...అవి నానికి గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పు అని చెప్పారట.
అయితే ఆ తర్వాత నాని మాట వరసకు కూడా నాకు మీరు ఓవర్సీసీ రైట్స్ ఇచ్చారు.. దాని వలన ఇంత డబ్బు వచ్చింది.. ఈ ఓవర్సీస్ రైట్స్ ఇచ్చినందుకు థాంక్స్ అని కానీ, హ్యాపీ అని కానీ చెప్పలేదట. ఇక చిన్న హీరోలతో సినిమాలు చెయ్యకూడదు. వారు ఎదుగుతున్నప్పుడు డబ్బు కనిపిస్తే.. మిగతా వారిని మరిచిపోతారు. అదే పెద్ద హీరోలతో సినిమా చేసి ప్లాప్ అయినా.. వారు మనకి ఇంకో సినిమా చేసి పెడతారు అంటూ నాని మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారాయన.