Advertisementt

కంగనాకు సెటైర్ వేసిన నటి

Thu 29th Apr 2021 08:45 PM
rakhi sawant,kangana ranaut,oxygen,hospitals,pm modi  కంగనాకు సెటైర్ వేసిన నటి
You have crores of rupees: Rakhi Sawant asks Kangana Ranaut to serve the nation by procuring oxygen and distribute it among needy కంగనాకు సెటైర్ వేసిన నటి
Advertisement
Ads by CJ

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయాన్నీ అయినా సూటిగా మాట్లాడుతుంది. నిన్నటికి నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో విఫలమైన కారణముగా నెటిజెన్స్ #ResignModi అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చెయ్యడంతో.. అవును కరోనా కట్టడి మీరు చెయ్యండి.. మోడీ మీద ట్రోల్ చేసే వారికీ బాగా తెలుసు కరోనా కట్టడి ఎలా చెయ్యాలో.. మరి మోడీ గారికి నాయకత్వం తెలియదు. సచిన్ కి బ్యాటింగ్ తెలియదు, కంగనాకు నటన తెలియదు అంటూ మోడీని ట్రోల్ చేసే వారిపై చెలరేగిపోయింది. అయితే ఇప్పుడు కంగనా కి మరో బాలీవుడ్ నటి సెటైర్ వేస్తుంది. బాలీవుడ్ లో కాంట్రవర్సీ నటిగా పేరు తెచ్చుకున్న రాఖి సావంత్ చాలా రోజుల తర్వాత రోడ్డుపై చక్కర్లు కొడుతూ మీడియాతో ముచ్చటిచ్చింది. కరోనా చాలా ప్రమాదకారి.. బయటికి వచ్చే వారు డబుల్ మాస్క్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, భౌతిక దూరం తప్పనిసరి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. 

అయితే ఓ విలేఖరి మేడం కరోనానని కట్టడి చెయ్యడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారో.. లేదో.. అది పక్కనబెట్టి.. కానీ ప్రస్తుతం దేశం లో ఆక్సిజెన్ కొరత తీవ్రంగా ఉంది, చాలా ప్రాంతాల్లో ఆక్సిజెన్ దొరకడం లేదంటూ నటి కంగనా రనౌత్ కూడా మాట్లాడుతున్నారు అనగానే.. రాఖి సావంత్ వెంటనే.. అవునా దేశంలో ఆక్సిజెన్ దొరకడం లేదా.. ప్లీజ్ కంగనా రనౌత్ మీ దగ్గర కోట్లకి కోట్లు ఉన్నాయి కదా.. ఆ డబ్బుతో ఆక్సిజెన్ సిలిండర్ కొని హాస్పిటల్స్ కి పంపించొచ్చు కదా.. అంటూ కంగనా పై వెటకారంగా సెటైర్ వేసింది. మరి కంగనా రాఖీకి కౌంటర్ ఎలా ఇస్తుందో చూడాలి.

You have crores of rupees: Rakhi Sawant asks Kangana Ranaut to serve the nation by procuring oxygen and distribute it among needy:

Rakhi Sawant asks Kangana Ranaut to serve the nation by distributing oxygen to people

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ