ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించి ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్న నాగ్ అశ్విన్ ఈ మధ్యనే జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ప్రస్తుతం దేశం లో ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వలన సెలబ్రిటీస్ దగ్గర నుడ్ని చిన్న చిన్న పనులు చేసుకునే వారి వరకు కరోనా కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. ఒక పక్క కరోనా పేషేంట్స్ కి బెడ్స్ దొరకడం లేదు. మరోపక్క ఆక్సిజెన్ అందక కరోనా పేషేంట్స్ చనిపోతున్నారు. దేశ ప్రధానితో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్ డౌన్ విధించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టలేదు కానీ.. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ మలవుతుంది.
అయితే తాజా పరిస్థితుల్లో ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభుత్వం లాక్ డౌన్ పెడుతుందో లేదో కానీ.. నాకు నేను వచ్చే రెండు వారాల పటు లాక్ డౌన్ పెట్టుకున్నాను. అదేమిటి లాక్ డౌన్ మీకు మీరే పెట్టేసుకున్నారు.. అది కాదు కరొనకి సమాధానం అంటే.. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులని గమనించండి అప్పుడు అర్ధమవుతుంది.. త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ ట్వీట్ చేసాడు. అయితే చాలామంది నెటిజెన్స్ మీకేంటి సామి.. మీరు డబ్బున్నోళ్ళు, రెండు వారాలపాటు బయటికి రాకపోయినా.. మీకు ఎలాంటి ప్రోబ్లెంస్ ఉండవు.
కానీ రోజువారీ కూలి పనికి వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు ఇలా లాక్ డౌన్ విధించుకుంటే వారికి రెండు పూటలా తిండి దొరకదు. అసలు కరోనా కట్టడికి లాక్ డౌన్ కూడా సరైన పరిష్కారం కాదు. ఎవరికీ వారే.. మాస్క్, శానిటైజేర్, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం, అందరూ కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటూ నాగ్ అశ్విన్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టడానికి ఒప్పుకోవడం లేదు. ప్రజలు లాక్ డౌన్ ఎంతగా నష్టపోతున్నారో చెబుతున్నారు. కానీ లాక్ డౌన్ వలన కరోనా కట్టడి సాధ్యమైనా.. మిగతా పరిస్థితులని కూడా చూసుకుకోవాలి సామి అంటున్నారు.