Advertisementt

అచ్చొచ్చిన సంక్రాంతి వైపు ఎఫ్ 3 చూపు

Thu 29th Apr 2021 05:56 PM
venky,venkatesh,varun tej,anil ravipudi,dil raju,f 3 movie,f3 postponed,2022 sankranthi  అచ్చొచ్చిన సంక్రాంతి వైపు ఎఫ్ 3 చూపు
F3 postponed to next year? అచ్చొచ్చిన సంక్రాంతి వైపు ఎఫ్ 3 చూపు
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబోకి సంక్రాంతి బాగా అచ్చొచ్చిన పండగ . ఈ కాంబో లో వచ్చిన ఎఫ్ 2 సంక్రాంతికి వచ్చి బాక్సాఫీసుని షేక్ చేసింది. సంక్రాంతికి విడుదలైన కామెడీ ఫిలిం ఎఫ్2 బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తేవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ - వరుణ్ తేజ్ - తమన్నా - మెహ్రీన్ కలయికలో ఎఫ్ 3 షూటింగ్ మొన్నటివరకు నిరాటంకంగానే సాగింది. కానీ నిన్నటివరకు అనిల్ రావిపూడి కరోనా బారిన పడడంతో.. ఎఫ్3 షూటింగ్ కి బ్రేక్ పడింది. అనిల్ రావిపూడికి కరోనా సోకడంతో.. ఎఫ్ 3 షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ వేసినా.. ప్రస్తుతం ఉన్న ఈ సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో మిగతా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న టైం కి సినిమాని రిలీజ్ చెయ్యడం జరిగేలా కనిపించడం లేదు. అందులోనూ వెంకీ ఈ కరోనా క్రైసిస్ లో షూటింగ్ చెయ్యడం మంచిది కాదని అంటున్నారు.

అనిల్ రావిపూడి కూడా కరోనా పరిస్థితులు చక్కబడే వరకు ఎఫ్ 3 షూటింగ్ ఆపెయ్యాలి అని అనుకుంటున్నాడట.  ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ రావడంతో ఎఫ్ 3 రిలీజ్ డేట్ కూడా మారుతుంది. అయితే అయ్యింది. మనకి కలిసొచ్చిన సంక్రాంతి రేసులోనే ఎఫ్ 3 ని నిలిపుదామని డిసైడ్ అయ్యి.. ఈ విషయాన్ని దిల్ రాజు కి చెప్పగా.. ఓకె నువ్వెలా అంటే అలాగే అని దిల్ రాజు అనిల్ రావిపూడికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దానితో మూవీ టీం కూడా కూల్ అయ్యింది అని తెలుస్తుంది. వేంకటేష్ ప్రస్తుతం నారప్ప, దృశ్యం 2 మూవీ షూటింగ్స్ పూర్తి చేసేసి ఇంటికి పరిమితమవగా.. వరుణ్ తేజ్ ఎఫ్ 3 షూటింగ్ ఆగిపోవడంతో.. మరో సినిమా గని షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది.

F3 postponed to next year?:

Venky-Varun F3 Postponed To 2022 Sankranthi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ