ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వెవ్ తో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సెకండ్ వేవ్ అల్లకల్లోలానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇండియాలో గాలి లేక ప్రాణాలు వదులుతున్నారు. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పుతుంది. గత ఏడాది ఇండియా కరోనా కట్టడిలో నెంబర్2 లో కొనసాగితే.. నేడు కరోనా సెకండ్ వేవ్ కి బలైన దేశంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దానితో భరత్ కి పెద్ద ఎత్తున సహాయం అందించడానికి చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. అంతేకాదు అమెరికా వంటి అగ్ర రాజ్యం భారత్ కి సహాయం చెయ్యడానికి ముందుంటామని ప్రకటించింది.
అలాగే తమ దేశ పౌరులని తక్షణం ఇండియాని వదిలి స్వదేశానికి రావల్సిందిగా హెచ్చరికలుజారీ చేస్తుంది అమెరికా. ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉండడం సేఫ్ కాదని, ప్రస్తుతం ఇండియాకి తమ దేశం నుండి ఎవరూ వెళ్లోద్దని, ఇండియాలో ఉన్నవారు త్వరగా అమెరికాకి వచ్చెయ్యాలని అమెరికా హెచ్చరిస్తుంది. ఇండియా నుండి డైరెక్ట్ గా అమెరికా కి విమానాలు ఉన్నాయని, అలాగే యూరప్ గుండా మరిన్ని విమాన సర్వీస్ లు ఉన్నాయని.. ఎలాగైనా ఇండియా ని వదిలి తక్షణమే స్వదేశానికి చేరుకోవాలని అమెరికా సూచిస్తుంది.