బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు ప్లాప్స్ తర్వాత బోయపాటి తో సినిమా మొదలు పెట్టడానికి చాలా లెక్కలే వేసాడు. ఎట్టకేలకు BB3 పట్టాలెక్కడం, మొదటి టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేంది. అయితే ఈ సినిమా అనుకున్నప్పటినుండి.. BB3 బడ్జెట్ పై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. బడ్జెట్ లిమిట్స్ దాటేస్తుంది అని, దానికోసమే సినిమా త్వరగా మొదలు కాలేదనే టాక్ నడిచింది. ఇప్పుడు సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కూడా మరోమారు అఖండ మూవీ బడ్జెట్ విషయాలే హైలెట్ అవుతున్నాయి. అఖండ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
అయితే బోయపాటి తాను అనుకున్న అవుట్ ఫుట్ రావడానికి చాలా కష్టపడుతున్నాడు. దాని కోసం బడ్జెట్ అదుపు తప్పింది అని, మరో పక్క బాలకృష్ణ బడ్జెట్ కంట్రోల్ కోసం ఆయన చెయ్యాల్సింది చేస్తున్నాడట. అంటే పారితోషకం ఎక్కువగా తీసుకోకుండా కేవలం 7 కోట్లే బాలయ్య పారితోషకం ఇమ్మన్నాడట. ఈ సినిమా మొదలైన కొత్తల్లో బాలయ్య పారితోషకం, బోయపాటి పారితోషాలపై పెద్ద చర్చ జరిగినా... ఇప్పుడు అఖండకి బాలయ్య మాత్రం కేవలం 7 కోట్లకు సర్దుకుపోయాడట. బోయపాటి అయితే ఎలాంటి పారితోషకం లేకుండా ఈ సినిమా చేస్తున్నాడని టాక్. బాలయ్య ఉదారత చూసి నిర్మాత కూడా సినిమాకి లాభాలొస్తే వాటా ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా టాక్. మరి BB3 అఖండ మీద మార్కెట్ లో ఎన్ని అంచనాలున్నాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.