తెలంగాణాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు కట్టడిలో భాగంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. దానితో కేసులు తగ్గుముఖం పట్టాయంటూ కోర్టుకి నివేదిక సమర్పించింది తెలంగాణా ప్రభుత్వం. కానీ హై కోర్టు మాత్రం సంతృప్తి చెందలేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయనకి ఈ రోజు కరోనా రాపిడ్ టెస్ట్ చెయ్యగా అందులో నెగెటివ్ రాగా.. వైద్యులు కేసీఆర్ కి RTPCR టెస్ట్ చేసారు. ఇంకా ఆ టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉంది.
అయితే తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. తెలంగాణాలో లాక్ డౌన్ పెడతారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానితో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లైన్ లోకి వచ్చి.. తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టడం కేసీఆర్ కి ఇష్టం లేదని.. ఆయన కరోనా నుండి పూర్తిగా కోలుకోగానే అధికారులతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటారని, లాక్ డౌన్ వలన చాలా నష్టాలూ చవి చూడాల్సి వస్తుంది అంటూ మహ్మద్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి కేసీఆర్ లాక్ డౌన్ విధించే అంశాలను అధికారులతో చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.