శేఖర్ కమ్ముల - నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ కరోనా వలన రిలీజ్ వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ వలన థియేటర్స్ మూత బడుతుండడంతో ముందుగానే అప్రమత్తమైన లవ్ స్టోరీ టీం.. సినిమాని వాయిదా వేసింది. ఇప్పుడు చాలా సినిమాలు లవ్ స్టోరీ బాటలోనే రిలీజ్ లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అయితే కరోనా నిభంధనలతో షూటింగ్స్ చేస్తున్నా సెట్స్ లో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. 24 క్రాఫ్ట్స్ వారిని జాగ్రత్తగా చూసుకుంటూ సినిమా షూటింగ్ చెయ్యడం కరోనా పరిస్థితుల్లో నిర్మాతలకి సవాల్ గా మారింది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు.
అయితే లవ్ స్టోరీ నిర్మాతలు లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ని కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపట్టినా.. షూటింగ్ పూర్తయ్యేవరకు ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. షూటింగ్ టైం లో కేవలం 100 మందితో మాత్రమే చిత్రకరణ చేశామని, సెట్స్ లో ప్రతి ఒక్కరికి గుడ్డు, పాలు, పౌష్టికాహారంతో పాటుగా మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్.. అలాగే ఓ 100 మందికి కరోనా ఇన్సూరెన్స్ అంటే.. ఒక్కొక్కరికి మూడు లక్షల కరోనా ఇన్సూరెన్స్ చేయించామని, దానితో సినిమా బడ్జెట్ లో మరో 50 లక్షలు అదనంగా ఖర్చు అయ్యింది అని, అయినా టీం సభ్యులెవరికి కరోనా బారిన పడకుండా షూటింగ్ ముగించామని నిర్మాతలు తెలిపారు. మరి ఇది నిజంగా గర్వపడే విషయమే. లవ్ స్టోరీ నిర్మాతలు వలే అందరూ ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే... ఏ ఒక్క సభ్యుడు కరొనతో కష్టాలు పడరు. సినిమా షూటింగ్స్ సజావుగా సాగుతాయి.