Advertisementt

గణేష్ మాస్టర్ మీరు.. పవన్ లా కనిపిస్తున్నారు

Wed 28th Apr 2021 05:53 PM
dance master,ganesh master,dhee dance show,dhee kings and queens,pawan kalyan,hyper aadi  గణేష్ మాస్టర్ మీరు.. పవన్ లా కనిపిస్తున్నారు
Kings vs Queens latest promo telecasted on 28th April గణేష్ మాస్టర్ మీరు.. పవన్ లా కనిపిస్తున్నారు
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా ఢీ డాన్స్ షో లో జేడ్జ్ ప్లేస్ లో శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. ఆయన ప్లేస్ లోకి ఏ సంఘవినో, ఏ గణేష్ మాస్టరో.. ప్రియమణి, పూర్ణ తో పాటుగా జెడ్జి స్థానంలో కూర్చుంటున్నారు. అయితే ఈ రోజు రాబోయే ఢీ కింగ్స్ - క్వీన్స్ ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ అప్పు చేసి.. లైఫ్ రిస్క్ లో పెట్టుకోగా.. అప్పుల వాళ్ళు అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు.. ఆ అప్పు తీర్చలేక.. లేడు అని వాళ్ళ అమ్మతో చెప్పిస్తున్నాడు అంటూ ఓ డాన్స్ మాస్టర్ స్టేజ్ మీద ఆ కంటెస్టెంట్ గురించి చెప్పడంతో ఆ స్టేజ్ మీదున్న సుధీర్, రష్మిక, ఆది, ప్రదీప్, దీపికా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జేడ్జ్ ప్లేస్ లో ఉన్న గణేష్ మాస్టర్.. ఎందుకు అప్పు చేసావ్ అనగా.. అతను ఆ అప్పుడు విషయం చెప్పాడు. షో అవ్వగానే నన్ను కలవు నేను ఇస్తాను అన్నాడు గణేష్ మాస్టర్.

ఆ మాట గణేష్ మాస్టర్ నోటి వెంట రాగానే హైపర్ ఆది లేచి.. గణేష్ మాస్టర్ లవ్ యు మాస్టర్,  మీరు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసారు.. ఇప్పుడు నా కళ్ళకి మీరు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తున్నారు.. అని అనగానే మా బాస్ పవన్ కళ్యాణ్ ఆయన్ని చూసే ఇలాంటివి నేర్చుకున్నాను అని గణేష్ మాస్టర్ ఢీ డాన్స్ స్టేజ్ మీద చెప్పడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. ఇక గణేష్ మాస్టర్ పవన్ గబ్బర్ సింగ్ సాంగ్ కి డాన్స్ చేసి మా బాస్ పవన్ కళ్యాణ్ అంటూ అదిరిపోయే స్టెప్స్ వేసి చూపించాడు.

Kings vs Queens latest promo telecasted on 28th April:

Everyone on the sets got emotional after a dance performance and his personal life problems and Ganesh Master assured him he will help him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ