సినిమాల్లో విలన్ కేరెక్టర్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోను సూద్ ఇప్పుడు రియల్ హీరోగా కొనియాడబడుతున్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేసి గొప్ప మనసుని చాటుకున్నాడు. తాను కరోనా బారిన పడిన సమయంలోనూ ఓ వ్యక్తికీ ప్రాణవాయువు అందించి రియల్ హీరోగా నిలిచాడు సోను సూద్. కరోనా అనే కాదు.. చాలామందికి సోను సూద్ సహాయం జీవనోపాధిని కలిపిస్తుంది. తన కష్టాన్ని చెబుతూ సోను సూద్ ని టాగ్ చేస్తే.. తన టీం తో వాళ్ళ కష్టాలని తెలుసుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నారు సోను సూద్.
ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యడం కన్నా అదృష్టం ఏం లేదని.. ఆ తృప్తి తనకి 100 కోట్ల సినిమాలో నటించినా లభించదు అంటూ సోను సూద్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కరోనా తో ప్రజలు ఆహాకారాలు చేస్తూ.. హాస్పిటల్స్ లో బెడ్స్ లేక నిద్రకు దూరమవుతుంటే.. తనకి నిద్ర రావడం లేదని.. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలో నటించడం కన్నా ప్రజలకి సేవ చెయ్యడం లోనే ఎక్కువ తృప్తి ఉంది అంటూ సోను సూద్ ట్వీట్ చేసారు. వలస కార్మికుల్ని ప్రత్యేక విమానంలో పంపడం దగ్గరనుండి.. పేద ప్రజలను ఆదుకోవడం వరకు సోను సూద్ ఉదారత ఎప్పటికప్పుడు మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాము.