విజయ్ దేవరకొండ - రష్మిక గీత గోవిందం సినిమా అప్పటినుండి మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో నటించిన ఈ జంట ప్రేమలో పడింది అని, వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. విజయ్ దేవరకొండ హౌస్ వార్మింగ్ కి ఒక్క రశ్మికనే ప్రత్యేకంగా ఇన్వైట్ చెయ్యడం హాట్ టాపిక్ అవ్వగా.. వారిద్దరూ ముంబై లో డిన్నర్ డేటింగ్ కి వెళ్లడం, అలాగే రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లో కూడా కలిసి నటించడం వంటి విషయాలతో బాగా హైలెట్ అవుతున్నారు.
తాజాగా రష్మిక - విజయ్ దేవరకొండ కాంబో మరోసారి రిపీట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరూ మరోసారి కలిసి నటించే ఛాన్స్ ఉన్నట్లుగా రశ్మికనే చెబుతుంది. అంటే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తర్వాత సుకుమార్ తో చెయ్యబోయే మూవీ లో రష్మిక కి ఛాన్స్ ఇవ్వబోతున్నారా? లేదంటే విజయ్ నెక్స్ట్ మూవీ అంటే సుక్కు దే. శివ నిర్వాణతో విజయ్ ఓ కమిట్మెంట్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం విజయ్ చూపు పాన్ ఇండియా వైపే ఉంది కాబట్టి.. మరో పాన్ ఇండియా దర్శకుడుతో విజయ్ నెక్స్ట్ ఉండొచ్చు. అంటే విజయ్ దేవరకొండ రష్మిక కాంబో రిపీట్ అనేది ఏ దర్శకుడు కల్పిస్తాడో చూడాలి.