ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ చెయ్యడం కత్తి మీద సాములా మారిపోయింది. కరోనా కట్టడి కోసం చేసే ప్రయత్నాలు అన్ని వృధా అయ్యిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలతో షూటింగ్ చేసినా.. ఎక్కడో ఓ చోట కరొనకి దొరికిపోతున్నారు. అయితే పుష్ప యూనిట్ మాత్రం కరోనా నిభందనలు పాటిస్తూ షూటింగ్ జరుపుతుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప యూనిట్ లో జాయిన్ అయ్యాడు. అల్లు అర్జున్ కి విలన్ గా ఫహద్ పుష్ప షూట్ లోకి ఎంటర్ అయ్యాడు. అయితే మలయాళ నటుడు ఫహద్ భార్య నజ్రియా కూడా నాని అంటే సుందరానికి తెలుగు సినిమా కోసం హైదరాబాద్ లోనే స్టే చేసింది.
వైఫ్ అండ్ హస్బెండ్ లు హైదరాబాద్ లోనే ఉండి.. తమ సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఫహద్ పుష్ప పోరాట సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. నజ్రియా నాని తో రొమాంటిక్ సన్నివేశాల్లో పాల్గొంటుంది. అయితే ఫహద్ ఫాజిల్ పుష్ప షూటింగ్ కోసం రిస్క్ చేస్తూ ధైర్యంగా పోరాడుతుంటే.. భార్య నజ్రియా మాత్రం కరోనా భయంతో అంటే సుందరానికి షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి చెన్నై కి వెళ్ళిపోయింది. మరి భర్త ఫహద్ పోరాటంతో పుష్ప షూటింగ్ నిర్విరామంగా సాగుతుంటే.. భార్య పిరికితనంతో అంటే సుందరానికి షూటింగ్ ని ఆపెయ్యాల్సి వచ్చింది.