కరోనా విలయతాండవంతో థియేటర్స్ అన్ని మూతబడ్డాయి. దానితో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. అయితే థియేటర్స్ మొత్తంగా ముయ్యకముందు.. 50 పర్సెంట్ అక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చాయి ఆయా ప్రభుత్వాలు. దానితో చిన్న చిన్న సినిమాలు ఆ 50 పర్సెంట్ అక్యుపెన్సీకి రిలీజ్ లకి సిద్దపడిపోయాయి. అందులో అనసూయ థాంక్యూ బ్రదర్ ఒకటి. అయితే ఇప్పుడు మొత్తంగా థియేటర్స్ మూసెయ్యడంతో థాంక్యూ బ్రదర్ ని ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈమధ్యనే మొదలైన సౌత్ ఓటిటి ఆహా అనసూయ థాంక్యూ బ్రదర్ ని కొనేసింది.
అనసూయ థాంక్యూ బ్రదర్ ని ఆహా ఓటిటి ఎంతకి కొంది.. ఎంత డీల్ కి ఎగరేసుకుపోయింది అనే చర్చమొదలైంది. అనసూయ సినిమాని ఆహా ఒటిటి చాలా చీప్ గా కొట్టేసింది అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ఆహా 1.8 కోట్లకు కొన్నట్లు టాక్ నడుస్తోంది. అంటే అనసూయ సినిమా కనీసం రెండు కోట్లు కూడా పలకలేదు. ఒక ఈవెంట్ చేస్తేనే అనసూయ కి లక్షల్లో ముడుతుంది. అలాంటి అనసూయ మీద మరీ ఇంత లో బడ్జెట్ మూవీనా.. ఇప్పుడు ఆమె అభిమానులకి అదే అవమానంగా ఉంది. ఇక థాంక్యూ బ్రదర్ మూవీ ఆహా ఓటిటి నుండి మే 7 న రిలీజ్ కాబోతుంది.