భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 12 న థియేటర్స్ లో విడుదలైన వైష్ణవ తేజ్ - కృతి శెట్టి కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. యూత్ ఫుల్ హిట్ అయ్యింది. మ్యూజికల్ గా ఉప్పెన సినిమా కి యూత్ బ్రహ్మ రథం పట్టారు. హీరో - హీరోయిన్, విలన్ విజయ్ సేతుపతి కేరెక్టర్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉప్పెన టీం చేసిన భారీ ప్రమోషన్స్ సినిమాకి భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. కృతి శెట్టి - వైష్ణవ్ తేజ్ ప్రమోషన్స్ సినిమాకి హైప్ క్రియేట్ చేసాయి. ఉప్పెన సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల షేర్ వసూలు చేసినట్టుగా మైత్రి మూవీస్ వారు అధికారికంగా ప్రకటించారు.
థియేటర్స్ లో ఆ రేంజ్ హిట్ అయిన సినిమా ఓటిటిలో కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కొనుక్కున్న స్టార్ మా కి కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ రావడం ఖాయమనుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే.. బుధవారం ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఉప్పెన మూవీ ఆదివారం స్టార్ లో ప్రసారమైంది. అసలు ఓటిటిలోనే హిట్ అవ్వలేదు.. ఇక స్టార్ మా లో ఆదివారం సాయంత్రం మరో ఛానల్ జెమిని లో ప్రసారం అయిన మాస్టర్ తో పోటీ పడింది. దానితో ఉప్పెన మూవీకి పూర్ టీఆర్పీ వచ్చింది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఉప్పెన ఓటిటి అలాగే బుల్లితెర మీద కూడా ప్లాప్ గా నిలిచింది.
కారణం ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత 100 పర్సెంట్ అక్యుపెన్సీతో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో సరైన బొమ్మ లేక.. ప్రేక్షకులు ఉప్పెన మీద హైప్ తో థియేటర్స్ కి క్యూ కట్టారు. దానితో సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ వచ్చి హిట్ అయ్యింది. కానీ ఓటిటికి వచ్చేసరికి అప్పటికే థియేటర్స్ లో చూసిన వారు మళ్ళీ ఓటిటి వైపు చూడలేదు.