కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలమైంది అంటూ తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. భరత్ లో గత ఏడాది కరోనా కట్టడిలో సక్సెస్ అయినా.. ఈ ఏడాది సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాని మోడీనే ప్రధాన కారణమంటూ నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. ట్విట్టర్ లో #ModiMadeDisaster #ModiDisasterForIndia #Resign_PM_Modi హాష్ టాగ్స్ ని ట్రేండింగ్ లోకి తీసుకువచ్చారు. మోడీ సరైన టైం లో సరైన నిర్ణయం తీసుకొని కారణంగానే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో ఎక్కువగా ఉంది అని.. అందుకే ప్రధాని మోడీ రాజీనామా చెయ్యాలనంటూ నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే బిజెపి ప్రభుత్వానికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మోడీ ని రాజీనామా చెయ్యమనే నెటిజెన్స్ పై ఫైర్ అవుతుంది. మోడీ ని ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్ ని ఉద్దేశిస్తూ.. అవును ప్రధాని మోడీ కి నాయకత్వం ఎలా వహించాలో తెలియదు.. అలాగే క్రికెట్ లో బాటింగ్ ఎలా చెయ్యాలో సచిన్ టెండూల్కర్ కి తెలియదు, అలాగే కంగనా కి నటించడం రాదు, లత మంగేశ్వర్ కి పాడడం తెలియదు.. కానీ ట్రోలర్స్ కి మాత్రం తెలుసు అంటూ సెటైర్స్ వేస్తుంది కంగనా.