వాళ్ళ అమ్మ చెప్పింది విని షాకయిన అనుష్క

Tue 27th Apr 2021 06:48 PM
anushka shetty,bikini show,billa movie,traditional heroine,glamour heroine  వాళ్ళ అమ్మ చెప్పింది విని షాకయిన అనుష్క
Anushka was shocked to hear what her mother said వాళ్ళ అమ్మ చెప్పింది విని షాకయిన అనుష్క

అనుష్క సూపర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు గ్లామర్ గర్ల్ గానే ప్రొజెక్ట్ అయ్యింది. చాలా సినిమాల్లో అనుష్క గ్లామర్ గా కనిపించింది కూడా. అయితే ప్రభాస్ తో నటించిన బిల్లా సినిమా కోసం అనుష్క టూ హాట్ అంటే బికినీ వేసి షాకిచ్చింది. అలాగే బిల్లా సినిమాలో చాలా అంటే చాలా గ్లామర్ షో చేసింది అనుష్క. అయితే సినిమాల్లో ఎంతగా గ్లామర్ షో చేసినా అనుష్క బయటికి వచ్చింది అంటే చాలు చాలా పద్ధతిగా మారిపోతుంది. పబ్లిక్ ఈవెంట్స్ లో అనుష్క చాలా నీట్ గా చుడిదార్లు, సారీస్ లోనే కనిపిస్తుంది తప్ప గ్లామర్ షో చేసింది లేదు. 

అయితే బిల్లా సినిమాలో అనుష్క గ్లామర్ షో చుసిన వాళ్ళ అమ్మ చెప్పింది విని అనుష్కనే షాకయ్యిందట. అనుష్క బికినిలో, మోడరన్ డ్రెస్సులతో బిల్లా లో కనిపించగా.. ఆ సినిమా చూసిన అనుష్క తల్లి.. ఇంకాస్త మోడ్రెన్ గా కనిపించాల్సింది.. సగం ట్రెడిషనల్ గా, సగం స్టైలిష్ గా కనిపించావ్ అనేసరికి అనుష్క షాకయ్యిందట. అసలు సినిమాల్లోకి రాకముందు అనుష్క చుడిదార్లు మాత్రమే ధరించేదట. కానీ బిల్లా లో ఆ కేరెక్టర్ డిమాండ్ మేరకు ట్రెండీగా, బికినీ షో చెయ్యాల్సి వచ్చింది అని అనుష్క ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

Anushka was shocked to hear what her mother said:

Anushka Shetty bikini show in Billa movie