Advertisementt

వకీల్ సాబ్ ఓటిటి డేట్ వచ్చేసింది

Tue 27th Apr 2021 04:47 PM
vakeel saab movie,digital premiere,30th april 2021,pawan kalyan  వకీల్ సాబ్ ఓటిటి డేట్ వచ్చేసింది
Vakeel Saab OTT release date Locked వకీల్ సాబ్ ఓటిటి డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర రెండు వారలు బాగానే సందడి చేసింది.. మూడో వారం నుండి కరోనా వలన థియేటర్స్ మూత బడడంతో వకీల్ సాబ్ కలెక్షన్స్ పడిపోయాయి. బాక్సాఫీసు సందడి తగ్గాక వకీల్ సాబ్ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ రిలీజ్ అయిన కొత్తల్లోనే వకీల్ సాబ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా న్యూస్ లు వచ్చినా వకీల్ సాబ్ టీం దాన్ని ఖండించింది. అయితే ఇప్పుడు థియేటర్స్ మూతబడడంతో.. వకీల్ సాబ్ ని ఎంత తొందరగా ఆన్ లైన్ లో విడుదల చేస్తే అంత మంచిది అంటున్నారు.

ఇప్పుడు ఆ డేట్ రానే వచ్చింది. వకీల్ సాబ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. 30 కోట్లకి వకీల్ సాబ్ డిజిటల్ హక్కులని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ 30 న స్ట్రీమింగ్ చేయనుంది. ఇంతకుముందే వకీల్ సాబ్ ఓటిటి డేట్ ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దానితో పవన్ కళ్యాణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర సందడి పూర్తిగా ముగియకముందే థియేటర్స్ క్లోజ్ అవడంతో ఢీలా పడిన ఫాన్స్.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ కి అత్యధిక వ్యూస్ తో రికార్డు క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు.

Vakeel Saab OTT release date Locked :

Exclusive digital premiere of Vakeel Saab on 30th April 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ