Advertisementt

యాంకర్ శ్యామల భర్త అరెస్ట్

Tue 27th Apr 2021 03:05 PM
anchor syamala,syamala husband,narasimha reddy,arrest,cheating case  యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
Anchor Shyamala husband arrested యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కంటెస్టెంట్ గానే కాదు.. పలు ఆడియో ఫంక్షన్స్ కి యాంకర్ గా అదరగొడుతున్న యాంకర్ శ్యామల బుల్లితెర మీద బాగా పాపులర్. అటు రాజకీయంగానూ జగన్ పార్టీకి దగ్గరగా ఉంటుంది. అప్పుడెప్పుడో భర్త నరసింహ తో కలిసి వైసిపి కండువా కప్పుకుంది కూడా. రీసెంట్ గా వై ఎస్ షర్మిలని కూడా కలిశారు ఈ దంపతులు. శ్యామల భర్త ఓ సీరియల్ ఆర్టిస్ట్. గతంలో పలు సీరియల్స్ లో నటించిన నరసింహ.. ప్రస్తుతం బుల్లితెర మీద కనిపించడం లేదు. తాజాగా శ్యామల భర్త ని పోలీస్ లు చీటింగ్ కేసులో అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

నరసింహ ఓ మహిళ నుండి కోటి రూపాయలు తీసుకుని.. ఆమెకి డబ్బు కట్టకుండా చీట్ చేసినట్టుగా ఆ మహిళ పోలీస్ లకి ఫిర్యాదు చేసింది. నర్సింహారెడ్డి తన వద్ద 2017లో కోటి రూపాయ‌లు తీసుక‌న్నాడ‌ని, డ‌బ్బులు చెల్లించ‌మ‌ని అడిగితే బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని చెప్పిన సదరు మహిళ తనని లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చెయ్యడంతో.. నరసింహ కి హెల్ప్ చేసిన మహిళతో పాటుగా.. నరసింహని కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. 

Anchor Shyamala husband arrested:

Anchor Syamala Husband Narasimha Reddy Arrest

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ