గతంలో కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష లాంటి హీరోయిన్స్ సౌత్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి బాలీవుడ్ అవకాశాలొచ్చాయి. అయితే వాళ్ళు ఒకటి రెండు అవకాశాలకే సౌత్ కి వచ్చేసారు. కానీ ఇప్పుడు రష్మిక వాలకం చూస్తుంటే.. పాప నార్త్ లోనే సెటిల్ అయ్యే సూచనలు కనిపిస్తన్నాయి. కారణం రష్మిక మందన్నకి బాలీవుడ్ లో వరస ఆఫర్స్ రావడమే. ఇప్పటికే తెలుగులో టాప్ పొజిషన్ కోసం పూజ హెగ్డే హీరోతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది.
రష్మిక స్పీడు చూస్తే మిగతా హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రష్మిక మందన్న ఇప్పటికి మిషన్ మజ్ను సినిమాలో సిద్దార్ధ్ మల్హోత్రాతో సినిమా మొదలు పెట్టిన రష్మిక.. అమితాబ్ తో గుడ్ బాయ్ లో నటిస్తుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బాయ్ చిత్రాలు షూటింగ్స్ లో రష్మిక జాయిన్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడో సినిమాకే కూడా మొదలు పెట్టబోతుందట. ఆ విషయాన్నీ రష్మీకి అభిమానులతో చిట్ చేసినప్పుడు రివీల్ చేసింది. గత రాత్రి అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను.. ఇప్పుడు మూడో సినిమాకి సైన్ చేయబోతున్నాను అంటూ చెప్పింది. ఆ కాంబో పై మాత్రం పెదవి విప్పలేదు.
మరి రష్మిక జోరుకి మిగతా హీరోయిన్ బేజార్ అన్నట్టుగా ఉంది రష్మిక యవ్వారం. చాలా తక్కువ సమయంలో బోలెడంత ఫేమ్ సంపాదించిన రష్మిక బాలీవుడ్ లో బడా ఆఫర్స్ తో దూసుకుపోతుంది.