రాధాకృష్ణ గారి భార్య మృతికి మెగా హీరోల సంతాపం
ABN MD Vemuri Radha Krishna wife passes awayఆంధ్రజ్యోతి- ఏబీఎన్ సంస్థల ఎమ్.డి.. జర్నలిస్ట్.. సంపాదకులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు తుదిశ్వాస విడిచారని తెలసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తి ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ కుటుంబమంతటికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి
శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. శ్రీ వేమూరి కనకదుర్గ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. పవన్ కళ్యాణ్
Mega heroes Condolences to Vemuri Kanaka Durga






































