మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ చిత్రం ఆచార్య విడుదలను వాయిదా వేస్తున్నాం: నిర్మాతలు
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా చేస్తున్నట్లు , పరిస్థితులు చక్కబడగానే సినిమా విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని
నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించారు.