అజయ్ కుమార్ డైరెక్షన్ లో కె ఎస్ రామారావు నిర్మించిన మాతృదేవోభవ సినిమా గుర్తుకురాగానే ఓ సన్నటికన్నిటి పొర వచ్చేస్తుంది. అమ్మ ప్రేమలోని గొప్పదనం, అమ్మ ప్రేమలోని ఎమోషన్స్ ని ఆ సినిమాలో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. మాధవి - నాజర్ భార్య భర్తలుగా.. పిల్లల విషయంలో తల్లి తీసుకునే నిర్ణయం, తాను చనిపోతున్న విషయం తెలిసి పిల్లలని అనాధలుగా మారకుండా ఆమె చేసే ప్రయత్నాలు, తాపత్రయం అందరి కంట కన్నీరు పెట్టించింది. అప్పట్లో 1993 లో మాతృదేవోభవ రిలీజ్ అయిన థియేటర్స్ లో కన్నీళ్లు తుడుచుకోవడానికి కచ్చిఫ్ లు పంచారంటే ఆ చిత్రం ఎంత ఎమోషనల్ గా సాగిందో అర్ధమవుతుంది.
ఆయితే ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూ లో కె ఎస్ రామరావు మాట్లాడుతూ.. మాతృదేవోభవకి రీమేక్ చెయ్యాలని ఉందని చెప్పడంతో ఒక్కసారిగా మాతృదేవోభవ సినిమా ముచ్చట తెరపైకి వచ్చింది. ఆ రీమేక్ ని అజయ్ కుమారే డైరెక్ట్ చేస్తాడని.. హీరోయిన్ గా నయనతార అయిపోతే బావుంటుంది కానీ.. ఆమె రెమ్యునరేషన్ చూస్తే భయమేస్తుంది అని రామరావు చెబుతున్నారు. నిజంగానే.. నయనతార టాప్ రెమ్యునరేషన్ అందుకునే తార. నయన్ గనక మాతృదేవోభవ రీమేక్ కి ఒప్పుకుంటే.. ఆ సినిమాకొచ్చే క్రేజ్ స్టార్ హీరో సినిమాకి వచ్చే క్రేజ్ తో సమానంగా ఉంటుంది.