Advertisementt

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నాగ్

Mon 26th Apr 2021 08:55 PM
nagarjuna,bangarraju movie,kalyan krishna,floors in july  ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నాగ్
Nagarjuna Bangarraju starts in July ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నాగ్
Advertisement
Ads by CJ

నాగార్జున కి ఎంతో ఇష్టమైన సోగ్గాడే చిన్ననాయన సినిమా హిట్ అవడంతో.. ఆ సినిమాకి సీక్వెల్ టైప్ లో బంగార్రాజు సినిమా చెయ్యాలని తెగ ముచ్చట పడ్డాడు. కళ్యాణ్ కృష్ణ తో స్క్రిప్ట్ వర్క్ చేయించి.. దానిలో మార్పులు చేర్పులు చేస్తూ నాగ్ కే క్లారిటీ లేక ఇప్పటివరకు బంగార్రాజు ముచ్చట తియ్యలేదు. మధ్యలో కళ్యాణ్ కృష్ణ పర్సనల్ ప్రోబ్లెంస్ తో ఆ సినిమాని పక్కనపడేసారు. ఇక నాగార్జున కి బంగార్రాజు పై నమ్మకం ఉన్నా ఆయనకి వరస డిజాస్టర్స్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సాహసం చెయ్యలేదు.

అయితే తాజాగా వైల్డ్ డాగ్ నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అవడంతో నాగార్జున మాట్లాడుతూ.. బంగార్రాజు సినిమా జులై నుండి పట్టాలెక్కుతుందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లుగా చెబుతున్నాడు. ఇక ప్రవీణ్ సత్తారు షూటింగ్ మొదలైనా.. కోవిడ్ వలన ఆ షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చింది అని నాగార్జునే చెప్పాడు. బంగ్గార్రాజు జులై నుండి మొదలు కాబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా 2 డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా చెప్పిన నాగ్ తనకి మొదటి డోస్ వేయించుకున్నప్పుడు ఏం అవ్వలేదని, కానీ సెకండ్ డోస్ వేయించుకున్నాక కాస్త బాడీ పెయిన్స్ వచ్చాయని.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ చెప్పుకొచ్చాడు.

Nagarjuna Bangarraju starts in July:

Nagarjuna Bangarraju to go on floors in July

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ