బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా.. షూటింగ్ లకి కాస్త గ్యాప్ వచ్చింది అంటే చాలు.. ఎంజాయ్మెంట్ కోసం ఏ గోవాకో, ఏ బ్యాంకాక్ కో లేదంటే కొత్తగా మాల్దీవులు చెక్కెయ్యడం అనేది తరుచు చూస్తూనే ఉంటాము. టాలీవుడ్ లో మహేష్ అయితే ఫ్యామిలితో అమెరికాకు, లేదంటే దుబాయ్, సింగపూర్ అంటూ వెళ్ళిపోతాడు. బాలీవుడ్ తారలు గోవా, మాల్దీవులకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే అలా తీరిక వేళల్లో బీచ్ వెంట బికినీ లు వేసుకుని సేద తీరడం అనేదాన్ని ఎవరూ తప్పు బట్టరు. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ లో మాల్దీవులకు, గోవా కి వెకేషన్స్ కి వెళ్లిన వారిని చూస్తే నిజంగా విచిత్రంగానే ఉంటుంది. ఢిల్లీ నుండి గల్లీ దాకా కరోనా కట్టడి చెయ్యలేక చేతులెత్తేస్తున్నారు.
కానీ బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రం గత వారం రోజులుగా మాల్దీవులికి చెక్కేసి అక్కడ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. బీచ్ ల్లో వారు చేసే అల్లరి ఫొటోస్, బికినీ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో విమర్శల పాలయ్యారు. తాజాగా కరోనా కారణంగా ఇప్పడు మాల్దీవులను క్లోజ్ చేస్తున్నట్టుగా, ఇండియా నుండి వచ్చే పర్యాటకులకు తాత్కలిక షాకిచ్చింది మాల్దీవులు ప్రభుత్వం. మాల్దీవులు పర్యాటక ప్రదేశం క్లోజ్ చెయ్యడంతో.. ఇప్పుడెక్కడికి వెళ్లి ఫొటోస్ దిగి వాటిని షేర్ చేస్తారు అంటూ బాలీవుడ్ తారలను ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.