ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mohan Babu gets the second dose of Covid-19 vaccination

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మోహన్‌ బాబు

Mohan Babu gets the second dose of Covid-19 vaccination

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజుకి లక్షలాది పాజిటివ్‌ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానుంది. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలో మొదటి డోస్‌ తీసుకున్న కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తాజాగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో తెలియజేశారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.

Mohan Babu gets the second dose of Covid-19 vaccination

mohan babu
second dose
covid-19
vaccination