Advertisementt

బన్నీ స్టయిల్ ని మ్యాచ్ చేయలేకపోయిన సల్మాన్

Mon 26th Apr 2021 01:32 PM
seeti maar song,radhe movie,release,salman khan,allu arjun,disha patani,prabhudeva,devi sri prasad  బన్నీ స్టయిల్ ని మ్యాచ్ చేయలేకపోయిన సల్మాన్
Salman Khan thanks Allu Arjun after the release of Seeti Maar song బన్నీ స్టయిల్ ని మ్యాచ్ చేయలేకపోయిన సల్మాన్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ డాన్స్ అంటే ఆ డాన్స్ లో ఓ స్టయిల్ కనిపిస్తుంది. ఓ ఈజ్ ఉంటుంది అందుకే బన్నీ డాన్స్ కి అంత క్రేజ్. బాలీవుడ్ టాప్ హీరోల సైతం అల్లు అర్జున్ డాన్స్ గురించి మాట్లాడమే దానికి నిదర్శనం. అంతేకాదు.. క్రికెటర్స్ లోనూ అల్లు అర్జున్ డాన్స్ కి దాసోహం అనే వారు ఉన్నారు. అల్లు అర్జున్ డాన్స్ ని క్రికెట్ మైదానం లో వెయ్యడం, హోటల్స్ రూమ్ లో వేసి వైరల్ చెయ్యడం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అదే అల్లు అర్జున్ డాన్స్ ని సల్మాన్ ఖాన్ చేస్తే ఎలా ఉంటుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ - దిశా పటాని కాంబోలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన రాధే సినిమాలో సల్లు భాయ్ అల్లు అర్జున్ నటించిన డీజే లోని సీటీ మార్ సాంగ్ కి స్టెప్పేస్తే..

అది కూడా దేవి శ్రీ మ్యూజిక్ లో. అందుకే సల్మాన్ ఖాన్.. అల్లు అర్జున్ లా ఇరగదీశాడా లేదో అనే ఆతృతలో అల్లు ఫాన్స్ ఉన్నారు. రాధే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీటిమార్ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది టీం. అయితే అల్లు అర్జున్ ఫాన్స్ ఎక్సపెక్ట్ చేసిన విధంగా సల్మాన్ స్టెప్స్ సీటిమార్ లో లేవు. సీటీ మార్ సాంగ్ లో మెయిన్ అట్రాక్షన్స్ దిశా పటాని గ్లామర్ .. ఆమె డాన్స్ స్టెప్స్ తప్పితే సల్మాన్ ఖాన్ స్టెప్స్ అస్సలు అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ ని మ్యాచ్ చేయలేకపోయాయి. సల్మాన్ ఖాన్ చూడడానికి లుక్స్ పరంగా బావున్నా.. ఆయన ఏజ్ పరంగా స్టెప్స్ వెయ్యలేక చేతులెత్తేసినట్టుగా అనిపించింది.

దేవిశ్రీ మ్యూజిక్ అదుర్స్, ప్రభుదేవా కొరియోగ్రఫీ సూపర్బ్, దిశా పటాని డాన్స్ బావుంది. కానీ సల్మాన్ ఖాన్ స్టెప్స్ బాలేదు. సల్మాన్ ని అల్లు అర్జున్ లా ఊహించుకుని సాంగ్ చూస్తే అడుగడుగునా నిరాశే మిగులుతుంది. బన్నీ డాన్స్ స్టయిల్ ని సల్మాన్ ఖాన్ మ్యాచ్ చెయ్యలేకపోయాడు. ఇక సీటిమార్ సాంగ్ రిలీజ్ చేసాక సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. అల్లు అర్జున్ ధన్యవాదాలు.. ఈ పాటకు మీ డాన్స్ పెరఫార్మెన్స్, మీరు డాన్స్ చేసిన విధానం, డాన్స్ స్టయిల్ అన్ని అద్భుతం.. లవ్ యు బ్రదర్ అంటూ ట్వీట్ చేసాడు.

Salman Khan thanks Allu Arjun after the release of Seeti Maar song:

Seeti Maar from Radhe release, Salman Khan thanks Allu Arjun for the song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ