Advertisementt

అనసూయ సినిమాని ఓటీటీకి అమ్మేసారు

Mon 26th Apr 2021 12:46 PM
anasuya,thank you brother movie,direct ott release,aha videos,aha ott  అనసూయ సినిమాని ఓటీటీకి అమ్మేసారు
Thank you Brother OTT Release Date locked అనసూయ సినిమాని ఓటీటీకి అమ్మేసారు
Advertisement
Ads by CJ

అనసూయ కీలక పాత్రలో నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా అసలైతే రేపు 30 న థియేటర్స్ లో విడుదలకు డేట్ ఇచ్చారు. థాంక్యూ బ్రదర్ మూవీ కరోనా కారణముగా 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద కూడా ఏప్రిల్ 30 న విడుదల చెయ్యడానికి మేకర్స్ సిద్దపడిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వలన అన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మూత పడ్డాయి. దానితో మళ్ళీ గత ఏడాది లాగే ఓటిటీల టైం స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పటివరకు తమ సినిమాలను ఓటిటి రిలీజ్ చేసేందుకు హీరోలెవరూ ముందు రావడం లేదు. అనసూయ ప్రెగ్నెంట్ గా కనిపిస్తున్న థాంక్యూ బ్రదర్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 

కానీ అనసూయ మేకర్స్ థాంక్యూ బ్రదర్ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు వెయిట్ చెయ్యలేమంటున్నారు. అందుకే తమ థాంక్యూ బ్రదర్ మూవీ ని మంచి రేటుకు ఆహా ఓటిటికి అమ్మేసారు. అనసూయ థాంక్యూ బ్రదర్ మూవీ ఆహా ఓటిటి నుండి మే 7 స్ట్రీమింగ్ అవ్వనుంది అని పోస్టర్ తో ఎనౌన్స్ చేసింది టీం. ఇప్పటివరకు నాని టక్ జగదీశ్, నాగ చైతన్య లవ్ స్టోరీ, తేజ సజ్జా ఇష్క్, అనసూయ థాంక్యూ బ్రదర్ మూవీస్ అన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడగా.. అందులో ముందుగా అనసూయ థాంక్యూ బ్రదర్ మేకర్స్ మాత్రం తమ సినిమాని ఓటిటికి అమ్మేసారు.

Thank you Brother OTT Release Date locked :

Anasuya Thank You Brother opts for a direct OTT release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ