ఏప్రిల్ 9 న భారీ బడ్జెట్ చిత్రం గా భారీ అంచనాలు నడుమ థియేటర్స్ లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్.. థియేటర్స్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. గత ఏడాది నుండి పెద్ద సినిమాలేవీ థియేటర్స్ లో విడుదలకాక పోవడం, అలాగే పవన్ కళ్యాణ్ మూడేళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉండడంతో పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీసుని అల్లాడించారు. దిల్ రాజు, వేణు శ్రీరామ్ లు వకీల్ సాబ్ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసారు. అయితే మొదటి వారం థియేటర్స్ లో దుమ్ము రేపిన వకీల్ సాబ్ రెండో వారంలోనూ 50 పర్సెంట్ అక్యుపెన్సీతో వసూళ్ల పరంగా ఓకె అనిపించింది.
కానీ మూడో వారం వచ్చేసరికి తెలంగాణాలో థియేటర్స్ బంద్, ఏపీలో ఈరోజు నుండి థియేటర్స్ బంద్ అవడంతో వకీల్ సాబ్ వసూళ్లు పడిపోయాయి. ఇక కరోనా కారణంగా నైట్ కర్ఫ్యూలతో ఏకంగా థియేటర్స్ యాజమాన్యాలు థియేటర్స్ ని మూసేసారు. అయితే వకీల్ సాబ్ విడుదలైన దగ్గరనుండి ఓటీటీ డేట్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. నిర్మాత, డైరెక్టర్ వకీల్ సాబ్ ఇప్పుడప్పుడే ఆన్ లైన్ లో విడుదలవదు.. థియేటర్స్ లో చూడండి అని మొత్తుకున్నారు. ఇప్పుడు థియేటర్స్ బంద్ అయ్యాయి. సో వకీల్ సాబ్ ని కొన్న అమెజాన్ ప్రైమ్ వారు ఎంత త్వరగా స్ట్రీమింగ్ చేస్తే వకీల్ సాబ్ కి అంత మంచిది. మంచి వ్యూస్ రావడం పక్కా. థియేటర్స్ లో చూడనివారు ఖచ్చితంగా ఓటిటిలో చూస్తారు.
ఫాన్స్ థియేటర్స్ లో చూసినా ఓటిటిలో బొమ్మ పడితే ఆగరు. ఇంకా ఇంకా లేట్ చేసే కన్నా వకీల్ సాబ్ ని ఇప్పుడు గనక అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇంతవరకు వకీల్ సాబ్ ఓటిటి రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చెయ్యలేదు.