ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో మునిగిపోయింది. కరోనా రోగులు ఆహాకారాలతో హాస్పిటల్స్ వద్ద భయానక వాతావరణం కనిపిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కరోనా నుండి కోలుకున్నారు. అయితే బాలీవుడ్ లో బడా సెలబ్రిటీస్ దగ్గరనుండి చిన్న చిన్న సెలబ్రిటీస్ వరకు కరోనా పాజిటివ్స్ తో హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోయారు. అయితే ఒక్కొక్కరిగా కోలుకుంటుంటే.. ఒక్కొక్కరిగా ఇంకా కరోనా బారిన పడుతూనే ఉన్నారు.
తాజాగా పాన్ ఇండియన్ హీరోయిన్ పూజ హెగ్డే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ఆమె ఫాన్స్ ఉలిక్కి పడ్డారు. పూజ హెగ్డే కి కరోనా పాజిటీవ్ రావడంతో ఆమె హోమ్ ఐసోలేషన్ కి వెళ్ళిపోయింది. పూజ హెగ్డే త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. పూజ హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ఓ సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండగా.. ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. పూజ హెగ్డే తాజా తమిళ చిత్రం, ఇంకా బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.