సంజన గల్రాని.. గత ఏడాది డ్రగ్స్ కేసులో సెన్సేషనల్ అయిన పేరు. కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బెంగుళూరు జైల్లో మూడు నెలల పాటు ఉంది.. తర్వాత బెయిల్ పై విడుదలైన సంజన మళ్ళీ కెరీర్ కోసమో.. లేదంటే తన మీద పడిన మచ్చని తొలగించుకునే ప్రయత్నమో కానీ.. సోషల్ మీడియాలో రోజుకో ఫోటో షూట్ తో హడావిడి చేసింది. ఆ తర్వాత అనుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ ని రహస్యంగా ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన పెళ్లి చేసేసుకుంది. కర్ణాటకకు చెందిన బిజినెస్ మ్యాన్, అలాగే డాక్టర్ అయిన పాషాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి పెళ్లి విషయాలేమి బయటికి చెప్పని సంజన తాజాగా కరోనా బారిన పడడంతో సోషల్ మీడియాలో ఆ విషయాన్నీ షేర్ చేసింది.
కెరీర్ పరంగా గత ఏడాది తాను ఎదుర్కున్న సమస్యలను, ప్రస్తుతం తాను ఎదుర్కుంటున్న సమస్యలపై ముచ్చటించింది. వ్యక్తిగతంగానూ, అటు వృత్తిపరంగాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అని, జైలు నుండి బెయిల్ పై బయటికొచ్చాక కొత్తగా లైఫ్ స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్నాను. అందుకే చిన్నప్పటినుండి ఫ్రెండ్ అయిన పాషా ని ప్రేమించి పెళ్లాడినట్లుగా చెబుతుంది. తమ స్నేహం ప్రేమగా మారింది అని, ఎవరికీ చెప్పకుండానే కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నామని.. ఆయన కరోనా రోగులకు సేవలందిస్తున్నారని చెప్పిన సంజన తామిద్దరం తాము కరోనా బారిన పడినట్లుగా చెబుతుంది.
భర్త పాషా కరోనా రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు గనక మేము ఏదో ఒక రోజు కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది అని ముందే ఊహించుకున్నట్టుగానే తామిద్దరం కరోనా బారిన పడినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది అని.. కాకపోతే తన బాధంతా తన భర్త ఆరోగ్యం గురించే అని.. ఆయన కూడా త్వరలోనే కోలుకుంటారని చెబుతుంది.