చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగానూ, ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్ కి కరోనా సోకడంతో ఆచార్య షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు. దానితో చిరు అలాగే ఆ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్ ఇంటికే పరిమితమయ్యాడు. మరో పక్క రామ్ చరణ్ ఆర్.ఆర్ ఆర్ షూటింగ్ కూడా వాయిదా పడింది. అందులోనూ రామ్ చరణ్ వ్యానిటి డ్రైవర్ కరోనా తో మృతి చెందడంతో చరణ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు.
ఆచార్య సినిమాని మే 13 న విడుదల చేస్తున్నట్లుగా డేట్ ఇచ్చినా.. ఇప్పుడు కరోనా కారణంగా ఆచార్య వాయిదా పడే సూచనలుండడంతో మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. మెయిన్ అట్రాక్షన్ గా చిరు కనిపిస్తుంటే.. రామ్ చరణ్ సిద్ద గా, అలాగే పూజ హెగ్డే నీలాంబరి గా ఈ సినిమాలో నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు షూటింగ్ ఆగిపోయిన ఆచార్య సినిమా నుండి నీలాంబరి సాంగ్ అంటే రామ్ చరణ్ - పూజ కాంబోలో తెరకెక్కిన నీలాంబరి అనే సాంగ్ లీకైనట్లుగా సోషల్ ఇండియాలో వైరాలవుతుంది.
ఉగాది రోజున రామ్ చరణ్ - పూజ హేగ్డ్ ల రొమాంటిక్ పోస్టర్ ని వదిలింది టీం. ఇప్పడు వారి మధ్యన సాగే రొమాంటిక్ సాంగ్ లీకైనట్లుగా తెలుస్తుంది. దానితో మెగా ఫాన్స్ ఉసూరుమంటున్నారు. ఆ లీకైన సాంగ్ ని అఫీషియల్ గా వదలండి.. అప్పడు సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుంది అంటూ మెగా ఫాన్స్ కొరటాల శివ కోరుకుంటున్నారు.