ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ సినిమాలతో చిన్నారి పెళ్లి కూతురు కాస్తా.. హీరోయిన్ గా మారిపోయింది అవికా గోర్. బబ్లీ గా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన అవికా గోర్ రాజుగారు గది 3 తర్వాత చాన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన టైం లో అవికా గోర్ ఒక బాయ్ ఫ్రెండ్ ని అందరికి పరిచయం చెయ్యడమే కాదు.. బాబ్లీ గా ఉన్న అవికా కాస్తా సన్నగా దర్శనమిచ్చి షాకులిచ్చింది. అవికా గోర్ గ్లామర్ అండ్ సన్నజాజిలా తయారైన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయో లేదో.. నాగ చైతన్య తన థాంక్యూ సినిమాలో ఆఫర్ ఇచ్చేసాడు.
అంతేకాకుండా రీసెంట్ గా అది సాయి కుమార్ అమరన్ మూవీలో అవికా గోర్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా లాంచ్ అయిన అమరన్ మూవీ ఓపెనింగ్ లో అవికా గోర్ ని చూస్తే సన్నగా నాజూగ్గా.. గ్లామర్ గా కనిపిస్తుంది. బబ్లీ గా ఉండే అవికా ఇలాంటి సైజు జీరో లో కనిపించడం కొత్తగానూ ఉంది. ట్రెడిషనల్ గర్ల్ కాస్తా.. గ్లామర్ గర్ల్ గా కనిపించి షాకిచ్చింది. అన్నీ ఓకె.. కానీ మొహం లో ఉండాల్సిన కళాకాంతులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. అవికా గోర్ మొహం లో కళ లేదు.. మొహం మొత్తం పీక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. సన్నగా అవ్వాలనే తాపత్రయంలో చాలామంది హీరోయిన్స్ మొహాల్లో ఉన్న గ్లో పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అదే తాపత్రయంలో అవికా గోర్ కూడా సన్నబడే ప్రాసెస్ లో మోహంలో కళాకాంతులను మిస్ చేసుకుంది.
కాకపోతే అవికా గోర్ సినిమాల కోసమో, గ్లామర్ కోసమో 13 కేజీల వెయిట్ తగ్గలేదట. తనకు హెల్త్ పరంగా ఉన్న కొన్ని ప్రోబ్లెంస్ వలన వెయిట్ లాస్ అయినట్లుగా అవికా గతంలో చెప్పింది.