మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ ని ఆపేసి తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. కారణం మహేష్ బాబు పర్సనల్ సైలిస్ట్ కి కరోనా రావడంతో.. తమ ఫ్యామిలీ డాక్టర్ సూచనలు మేరకు మహేష్ ఫ్యామిలీ మొత్తం, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇంట్లోనే పిల్లలతో సేద తీరుతున్న మహేష్ లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అందులో మహేష్ తన కూతురు సితార తో కలిసి కూర్చుని ఉన్న ఫోటో అది. బ్యాగ్రౌండ్ లో మిర్రర్స్ వెనక పచ్చటి చెట్లు కనిపిస్తున్నాయి. మహేష్ - సీత పాప కూర్చున్న రూమ్ వెనుక భాగం చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. మహేష్ ముందుకు వంగి సీత పాప కాలుని చూస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ఆయన కూతురు సితార పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక మహేష్ హోమ్ ఐసోలేషన్ ముగిసాక యధాతధంగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం పరశురామ్ ఇప్పటివరకు తెరకెక్కించిన సర్కారు వారి పాట రషెస్ చెక్ చేసుకుంటున్నాడట. మహేష్ మే మొదటి వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతాడని పరశురామ్ కూడా వెయిట్ చేస్తున్నాడు.