Advertisementt

పవన్ కి నెగెటివ్.. అయినా హోమ్ క్వారంటైన్

Sat 24th Apr 2021 10:32 PM
pawan kalyan,corona positive,negative,corona virus,lungs infection,pawan,home quarantine  పవన్ కి నెగెటివ్.. అయినా హోమ్ క్వారంటైన్
Pawan Kalyan still under Home quarantine పవన్ కి నెగెటివ్.. అయినా హోమ్ క్వారంటైన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడినట్లుగా పది రోజుల క్రితం ఆయన తన ఫామ్ హౌస్ లోనే క్వారంటైన్ లో ఉన్న ఫోటో తో సహా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లోకి నిమ్ము చేరడంతో పవన్ కళ్యాణ్ ని ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంచి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ టెస్ట్ చేయించుకోగా.. ఆయనకి రెండు రోజుల క్రితమే నెగటివ్ వచ్చింది. దానితో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటిగ్ లకి హాజరవుతారేమో అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నా.. ఆయన మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఆయన ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు.

కారణం ఆయన ఊపిరి తిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉండడం వలన పవన్ ఇంకా ట్రీట్మెంట్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి కరోనా నెగెటివ్ వచ్చినా ఆయన లంగ్స్ లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉండడంతో.. ఇంకా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని.. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. పవన్ త్వరలోనే కోలుకుంటారని చెబుతున్నారు. మరి నివేత థామస్, దిల్ రాజు లు కరోనా పాజిటివ్ వచ్చిన పది రోజుల్లోనే కోలుకుని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసినట్టుగా పవన్ కూడా షూటింగ్స్ కి హాజరైపోతారనుకుంటే.. ఇంకా ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉండడం పవన్ ఫాన్స్ ని కాస్త ఆందోళనకి గురి చేస్తుంది.

 

Pawan Kalyan still under Home quarantine:

Why Pawan Kalyan is still in home quarantine 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ