గత ఏడాది బిగ్ బాస్ 4 మొదలు కావడానికి చాలా ఆలస్యం జరిగింది. కరోనా లాక్ డౌన్ వలన కంటెస్టెంట్స్ కి కరోనా టెస్ట్స్ చేయించి.. 14 రోజులు ఓ హోటల్ రూమ్ లో పెట్టి.. తర్వాత వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం దగ్గర నుండి.. నాగార్జున కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కలవకుండా.. స్టేజ్ మీద మాత్రమే పరిచయం చేసారు. ఎప్పుడో జులై, ఆగష్టు లో మొదలు కావాల్సిన సీజన్ 4 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. ఇక నిన్నటివరకు బిగ్ బాస్ 5 సీజన్ జులై నుండి మొదలు కాబోతుంది.. ఈసారి కరోనా ప్రోబ్లెంస్ లేవనుకుంటే.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మరోసారి బిగ్ బాస్ పై పడింది. గతంలో 14 రోజుల క్వారంటైన్ సరిపోతే.. ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రత లో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టడం చాలా కష్టం.
లాక్ డౌన్ లేదు, షూటింగ్స్ ఆగలేదు, బుల్లితెర మీద జరిగే షూటింగ్స్ కి బ్రేకులు పడలేదు.. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టేందుకుని ఎలాంటి సమస్య లేకపోయినా.. సెకండ్ వెవ్ లో కరోనా సోకితే హాస్పిటల్ కి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. గతంలో పెద్దగా సింటెమ్స్ లేవు. కానీ సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మాములుగా లేదు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజెన్ లేక కరోనా రోగులు చనిపోవడం.. అమ్మో అంతా అల్లా కల్లోలంగా ఉంది. కాబట్టి సీజన్ 5 ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదంటున్నారు. అటు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఇంకా పూర్తి కాలేదు. సో.. బిగ్ బాస్ 5 కరోనా ఉధృతి తగ్గెవరకు మొదలు కాకపోవచ్చని.. ఒకేవేళ మొదలు పెట్టినా నాగార్జున మాత్రం హోస్ట్ గా రాడని అంటున్నారు.