కరోనా సెకండ్ వేవ్ కల్లోలంలో ప్రజలు అంతా కరోనా భయంతో అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూస్ తో వలస కూలీలు సొంతూళ్లకు పయనమవుతుంటే.. చెయ్యడానికి పనుల్లేక చాలామంది తిండి కోసం అల్లాడుతున్నారు. దేశం మొత్తం కరోనా భీబత్సంతో ఒణికిపోతుంటే.. బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రం మహారాష్ట్రలో లాక్ డౌన్ నడుస్తుండడంతో.. ఎంజాయ్ చెయ్యడానికి ప్లేస్ దొరకడం లేదు అన్నట్టుగా మాల్దీవులకు చెక్కేస్తున్నారు. పోనీ మాల్దీవులకు వెళ్లి వాళ్ళ ఎంజోయ్మెంట్ ఏదో వాళ్ళు చేసుకోక ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దేశ ప్రజలంతా కరోనా భయంతో ఒణికిపోతుంటే.. సెలబ్రిటీస్ ఇలా వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడంపై కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు చేతనైనంత సహాయం చెయ్యాలి కానీ.. ఇలా వెకేషన్స్ కి వెళ్లి ఫోటో షేర్ చేయడంపై శృతి మండిపడింది. అయితే నేడు దేశ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.. రోజుకి చాలామంది కరోనా కారణంగా చనిపోతున్నారు. ఇలాంటి టైం లో మాల్దీవుల బీచ్ లలో ఎంజాయ్ చేస్తున్న ఆ ఫోటొస్ ని షేర్ చెయ్యడం పై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ మండిపడుతున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది, దేశం కరోనా కల్లోలం లో మునిగిపోయింది, ఇలాంటప్పుడు వెకేషన్స్ ఫొటోస్ షేర్ చెయ్యడం చాలా దారుణమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
ప్రజలకి తినడానికి తిండి లేదు, కానీ మీరు మాత్రం డబ్బు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కొంచెమైనా సిగ్గుండాలి.. కనీసం మనసు కరిగి ప్రవర్తించాలి, మనమంతా దేశ ప్రజలని ఎంటర్టైన్ చేస్తున్నాము. డబ్బు సంపాదిస్తున్నాము. వాళ్ళు సినిమాలు చూస్తేనే మనకి డబ్బు వస్తుంది. ఇలాంటి టైం లో వాళ్ళని ఆదుకోవాలి కానీ ఇలాంటి ఎంజాయిమెంట్స్ పనికి రావంటూ బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద నవాజుద్దీన్ ఫైర్ అయ్యారు.