Advertisementt

పుష్ప కి అదెలా సాధ్యమవుతుంది

Sat 24th Apr 2021 04:25 PM
pushpa movie,allu arjun,sukumar,pushpa movie,corona,second wave  పుష్ప కి అదెలా సాధ్యమవుతుంది
Pushpa Shooting still in progress పుష్ప కి అదెలా సాధ్యమవుతుంది
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో కరోనా కల్లోలంతో చాలా సినిమాలు రిలీజ్ లు పోస్ట్ పోన్ అయితే.. చాలా సినిమాల షూటింగ్స్ లో టెక్నీకల్ సిబ్బంది, నటులు కరోనా బారిన పడడంతో సినిమా షూటింగ్స్ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక లాక్ డౌన్ లేకపోయినా.. చాలా సినిమా షూటింగ్స్ ని ఆపేసారు. కీలక నటులకు కరోనా సోకడంతో భారీ బడ్జెట్ మూవీస్ కూడా మూలనపడ్డాయి. టాలీవుడ్ లో కేవలం పుష్ప పాన్ ఇండియా ఫిలిం, బోయపాటి అఖండ మూవీ షూటింగ్స్ తప్ప మిగతా షూటింగ్స్ చాలా వరకు ఆగిపోయాయి. ఒక వేళ షూటింగ్ చేసినా కేవలం 50 మందితో మాత్రమే షూటింగ్ నిర్వహించాలంటూ నిర్మాతల మండలి తీర్మానించింది.

భారీ బడ్జెట్ మూవీ, యాక్షన్ ఎంటెర్టైనెర్ అయిన పుష్ప సినిమా షూటింగ్ కేవలం 50 మందితో చెయ్యడం సాధ్యమేనా? పెద్ద సినిమాకి కరోనా జాగ్రత్తలతో కేవలం 50 మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం అనేది ఎలా కుదురుతుంది. సెట్ లో కనీసం 100 నుండి 200  మంది పని చేస్తేనే కానీ.. షూటింగ్ కొలిక్కిరాదు. ఇక మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అలాగే రీసెంట్ గానే అనసూయ భరద్వాజ్ కూడా పుష్ప షూటింగ్ లో జాయిన్ అయ్యింది. గత ఏడాది కరోనా తో పుష్ప సినిమా షూటింగ్ మొదలవ్వడమే చాలా కష్టంగా మొదలైంది. అందుకే ఎట్టి పరితిస్థితుల్లోనూ షూటింగ్ ఆగకూడదని సుక్కు అండ్ బన్నీ లు కరోనా జాగ్రత్తలతో షూటింగ్ ఆగనివ్వడం లేదని తెలుస్తుంది. 

Pushpa Shooting still in progress:

Pushpa pan india movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ