కరోనా కల్లోలంతో ప్రపంచం మొత్తం ఒణికి పోతుంది. ఇక ఇండియా అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి అతలాకుతలం అయ్యింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు లెక్కకు మించి నమోదు కావడం, కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. హాస్పిటల్ లో బెడ్స్ కొరత, కరోనా పేషేంట్స్ కి ఆక్సిజెన్ కొరతతో ఆయా ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి సిట్యువేషన్ లో సెలబ్రిటీస్ విహార యాత్రలకు వెళ్లడంపై స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మండిపడుతుంది. కరోనా ఉగ్ర రూపనికి ప్రజలు బలవుతున్న వేళ.. ఇలా వెకేషన్స్ కి ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లడం కరెక్ట్ నా అని ప్రశ్నిస్తుంది.
కరోనా తో చాలా క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొంటున్నామని, ఇలాంటి సమయంలో చేతనైనంత సహాయం చెయ్యాలి కానీ.. విహార యాత్రలు అంటూ విదేశాలకు వెళ్లడం ఏమిటి.. అంటూ వెకేషన్స్ కి వెల్లిన సెలబ్రిటీస్ పై శృతి హాసన్ నిప్పులు చెరుగుతుంది. ఒక పక్క పార్టీలు చేసుకోవడం, మరోపక్క వెకేషన్స్ అంటూ మాల్దీవులకు చెక్కేస్తున్న బాలీవుడ్ తారలను ఉద్దేశించే శృతి ఇలా అనింది అనే గుసగుస వినబడుతున్నా.. ఈమధ్యన రణబీర్ కపూర్ దగ్గరనుండి అలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటాని, సారా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ మాల్దీవులకు విహార యాత్రలకి వెళ్లి అక్కడ బీచ్ ఒడ్డున బికినీలతో సందడి చెయ్యడమే కాదు.. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి చూసే శృతి ఈ విధంగా ఫైర్ అవుతుంది అంటున్నారు కొందరు.