తెలంగాణాలో ఇప్పటికే థియేటర్స్ మూతబడ్డాయి. ఏపీలో రేపటి నుండి థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దానితో థియేటర్స్ లో రిలీజ్ లు ఆగిపోయాయి. ఇక ఏప్రిల్ 9 న విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఫస్డ్ట్ వీక్ బాక్సాఫీసుని షేక్ చేసినా.. సెకండ్ వీక్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. ఏపీలో టికెట్స్ రేట్స్ విషయంలో గందర గోళం.. ఎన్ని వున్నా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మ్యానియా కలెక్షన్స్ రూపంలో కనబడింది. వకీల్ సాబ్ హిట్, కాదు బ్లాక్ బస్టర్ హిట్, వసూళ్ల పరంగా దిల్ రాజు ఫుల్ హ్యాపీ.. ఇదంతా ఆయనే ప్రెస్ మీట్ లో చెప్పాడు. మరి 89 కోట్ల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతే.. రెండు వారాలకు గాను వకీల్ సాబ్ కి 85 కోట్ల షేర్ వచ్చింది. అంటే వకీల్ సాబ్ కి 5 కోట్ల నష్టం వచ్చినట్టేగా. రెండు వరాల వకీల్ సాబ్ కలెక్షన్స్...
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం 24.25
సీడెడ్ 12.84
ఉత్తరాంధ్ర 11.72
ఈస్ట్ 6.17
వెస్ట్ 7.19
గుంటూరు 7.09
కృష్ణా- 4.91
నెల్లూరు 3.34
ఏపీ అండ్ టీఎస్ టోటల్ 77.52 కోట్లు
ఇతర ప్రాంతాలు 3.58
ఓవర్సీస్ 3.84 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ 85.17 కోట్లు షేర్