మోహన్ లాల్ నటించిన మలయాళం సూపర్ హిట్ దృశ్యం 2 మూవీ నేరుగా ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా.. ఆ సినిమా రీమేక్ దృశ్యం 2 తెలుగు వెర్షన్ కూడా ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. కోవిడ్ వలన థియేటర్స్ మూత బడ్డాయి. ఇక 45 రోజుల్లో సినిమా ని ఫినిష్ చేసింది కూడా ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడానికే అంటూ దృశ్యం 2 పై అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ దృశ్యం 2 ఓటిటి రిలీజ్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు.
అయితే దృశ్యం 2 నిర్మాత సురేష్ బాబు మాత్రం దృశ్యం 2 సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని, కోవిడ్ తగ్గి థియేటర్స్ ఓపెన్ అయ్యాకే దృశ్యం 2 ని రిలీజ్ చేస్తామని, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కాకుండా.. పూర్తి స్థాయి సామర్థ్యంతో థియేటర్స్ నడిచినప్పుడే దృశ్యం 2 రిలీజ్ ఉంటుంది.. ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడం లేదు అని చెప్పారు. అంతేకాదు దృశ్యం 2 ని థియేటర్స్ లో చూసాకే ఓటిటి లో చూసే అవకాశం ఉంటుంది అంటూ సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. దృశ్యం 2 హక్కులు తీసుకున్న 45 డేస్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోయారు. ఇక వెంకీ నారప్ప, దృశ్యం రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రెడీ టు రిలీజ్ అంటుంటే.. ఆయన నటిస్తున్న మరో చిత్రం ఎఫ్ 3 మాత్రం చిత్రీకరణ దశలో ఉంది.